శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ
NEWS Jun 29,2025 12:04 pm
ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,42, 382 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో నిల్. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 869.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు కాగా, కుడి, ఎడమ , జల విద్యుత్ కేంద్రాలలో ఇంకా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు.