మల్యాల మండల ప్రజలకు ఎస్ఐ సూచన
NEWS Jun 29,2025 10:25 pm
మొహర్రం పండుగ సందర్భంగా పెద్దపులుల వేషధారణ వ్యక్తులు తప్పకుండా తమ వివరాలు ముందే పోలీస్ స్టేషన్లో అందజేయాలని మల్యాల ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు. అలాగే పోలీసులు ఇచ్చే సూచనలు కచ్చితంగా పాటించాలని ఎస్ఐ పేర్కొన్నారు. ముందే సమాచారం అందజేయడం వల్ల తగిన భద్రత కల్పిస్తామని తెలిపారు. ఏదైనా సంఘటనలు తలెత్తితే చట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.