యార్లగడ్డ కృషికి మిచిగాన్ గవర్నర్ ఫిదా
NEWS Jun 28,2025 04:44 pm
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు మిచిగాన్ గవర్నర్ విట్మర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. యార్లగడ్డ అమెరికా పర్యటన సందర్భంగా గవర్నర్ ప్రత్యేకంగా లేఖ రాశారు. భారతీయ భాషల అభివృద్ధికి, సాంస్కృతిక బంధాల బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. మీరు భారతదేశం, అమెరికా మధ్య సాంస్కృతిక వారసత్వానికి మార్గం వేశారన్నారని తెలిపారు.