అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్ లు పంపిణీ
NEWS Jun 28,2025 10:35 pm
అంగన్వాడీలలో చిన్నపిల్లలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి పట్టణంలోని స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సెక్టార్ పరిధిలోని 102 అంగన్వాడీ కేంద్రాలకు పైలట్ ప్రాజెక్టు కింద మంజూరైన ఇండక్షన్ స్టవ్వులను, వాటర్ ఫిల్టర్ లను అంగన్వాడీ కార్యకర్తలకు పంపిణీ చేశారు.