తుంగభద్రకు కొనసాగుతున్న వరద
NEWS Jun 28,2025 03:39 pm
ఎగువన కురుస్తున్న వరద ఉధృతికి ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1620.20 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 63,816 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 200 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 61.889 టీఎంసీలుగా ఉందని తుంగ భద్ర డ్యాం నిర్వాహకులు వెల్లడించారు.