రేపే బీజేపీ ప్రెసిడెంట్ ఎన్నిక నోటిఫికేషన్
NEWS Jun 28,2025 10:28 am
బీజేపీ హైకమాండ్ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఈనెల 29న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు పార్టీ చీఫ్ , కేంద్ర మంత్రి జేపీ నడ్డా. 30వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని, జూలై 1వ తేదీన ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టు జాబితా తయారు చేస్తోంది ఎన్నికల టీం. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికపై కూడా అభిప్రాయాలు కూడా సేకరించనున్నారు.