టీవీ జర్నలిస్ట్ ఆత్మహత్యకు అతడే కారణం
NEWS Jun 28,2025 02:55 pm
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కారణమని స్వేచ్చ తండ్రి ఆరోపించాడు. భర్తతో విడిపోయాక స్వేచ్ఛ పూర్ణచంద్రరావుతో ఉంటోందన్నారు. స్వేచ్ఛ, పూర్ణచంద్రరావు మధ్య విబేధాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. పూర్ణతో కలిసి ఉండలేను నాన్న అని తనకి జూన్ 26న ఫోన్ చేసిందన్నారు. ఈ విషయంలోనే తన కూతురు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. నా కూతురు ఆత్మహత్యకు కారణమైన పూర్ణను కఠినంగా శిక్షించాలని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.