దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు
NEWS Jun 27,2025 10:33 pm
ఒంగోలులో మంత్రి నారాయణ అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టిడ్కో ఇళ్లను దీపావళి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నా ప్రజల సంక్షేమానికీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు.