ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థుల పడిగాపులు
NEWS Jun 27,2025 05:41 pm
వెలిగండ్ల మండలంలో ఆదాయం, కులం సర్టిఫికెట్లు కోసం విద్యార్థులు రోజులు తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఏ ఒక్క అధికారి కూడా సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తహసిల్దార్ వచ్చిన రోజు కంప్యూటర్ ఆపరేటర్ రాడు, ఆపరేటర్ వచ్చిన రోజు తహసిల్దార్ రాకపోవడంతో గత 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.