టీ20 క్రికెట్‌లో కొత్త రూల్స్.. పవర్‌ప్లేకు పక్కా లెక్క
NEWS Jun 27,2025 06:00 am
ఐసీసీ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. టీ20, టెస్ట్ ఫార్మాట్లలో ఆటను మరింత పారదర్శకంగా, వేగంగా మార్చేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా వర్షం లేదా ఇతర కారణాలతో ఓవర్లను కుదించిన టీ20 మ్యాచ్‌లకు సంబంధించి పవర్‌ప్లే ఓవర్లపై స్పష్టతనిచ్చింది. అలాగే టెస్టుల్లో స్లో ఓవర్ రేట్ సమస్యను అరికట్టేందుకు స్టాప్ క్లాక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.