తెలంగాణలో పొంగుతున్న ప్రాజెక్టులు
NEWS Jun 27,2025 10:51 am
ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 1,06,000 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 1,03,729 క్యూసెక్కులుగా ఉంది. మరో వైపు కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి కొనసాగుతోంది వరద ఇన్‌ఫ్లో 1,01,459 క్యూసెక్కులు కాగా , ప్రస్తుత నీటిమట్టం 864.30 అడుగులు ఉండగా, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉంది.