ఏపీ గవర్నర్ కార్యదర్శిగా కె. కన్నబాబు
NEWS Jun 27,2025 10:45 am
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కార్యదర్శిగా సీఆర్డీఏ కమిషనర్ గా ఉన్న కె. కన్నబాబును నియమించింది. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా గవర్నర్ ప్రస్తుత కార్యదర్శిగా పని చేస్తున్న హరి జవహర్ లాల్ ఈనెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. తన స్థానంలో కన్నబాబుకు బాధ్యతలు అప్పగించింది.