తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు
NEWS Jun 26,2025 05:06 pm
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది ఏసీబీ. కామారెడ్డి ఆర్టీఏ చెక్ పోస్ట్, పెద్దపల్లి, తిరుమలగిరి, ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అనధికారికంగా లెక్క చూపని రూ.1.81 లక్షల నగదు సీజ్ చేశారు. ఖమ్మం బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్, భీమదేవరపల్లి, వరంగల్ తనిఖీల్లో రూ.91 వేలు స్వాధీనం చేసుకున్నారు.