బైక్‌లకు టోల్ ట్యాక్స్.. నిజం కాదు
NEWS Jun 26,2025 05:07 pm
జులై 15 నుంచి జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ ట్యాక్స్ అంటూ జరిగిన ప్రచారాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. టూ వీలర్స్‌కు ఎలాంటి టోల్ ట్యాక్స్ విధించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. టూ వీలర్స్‌పై టోల్ ప్లాజాల దగ్గర ఎలాంటి ట్యాక్స్ విధించబోమని తెలిపింది.. అంతకుముందు టూవీలర్స్‌కు కూడా ఫాస్టాగ్ తప్పనిసరి అంటూ జోరుగా ప్రచారం జరిగింది.