1960 నేపథ్యంలోని కథ .. కోలీవుడ్ కి నాని?
NEWS Jun 26,2025 05:23 pm
కోలీవుడ్ కి నాని .. ఓ తమిళ సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రను పోషించనున్నాడనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అందుకు సంబంధించి రంగం సిద్ధమైందని అంటున్నారు. ఇటీవల తెలుగులో నాని నటించిన 'హిట్ 3' సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో కార్తీ ఒక కీలకమైన పాత్రలను పోషించాడు. 'హిట్ 4'లో హీరోగా చేసేది కార్తీనే. ఇక తమిళంలో తను చేసే సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేయమని కార్తీ కోరడంతో నాని అందుకు అంగీకరించాడని అంటున్నారు.