గాల్లోనే విమానం..ఇంజిన్‌లో మంటలు
NEWS Jun 26,2025 04:18 am
అమెరికాలో పెను విమాన ప్రమాదం తృటిలో తప్పింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించి ల్యాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.