బాక్సాఫీస్ వద్ద 'కుబేర' జోరు
NEWS Jun 25,2025 05:10 pm
ధనుష్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విడుదలైన నాటి నుంచి వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. తాజాగా చిత్ర నిర్మాణ బృందం వెల్లడించిన వివరాల ప్రకారం, ‘కుబేర’ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిందని అంచనా వేస్తున్నారు.