భారత్‌తో చర్చలకు సిద్ధం: పాక్ ప్రధాని
NEWS Jun 25,2025 01:40 pm
ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేంత వరకు పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరిపేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ, పాక్ మాత్రం చర్చల అంశాన్ని పదేపదే లేవనెత్తుతోంది. ఇరు దేశాల మధ్య పరిష్కారం కాని వివాదాలపై అర్థవంతమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా మరోసారి ప్రకటించారు.