నేను సోనియమ్మ బిడ్డను - సీఎం
NEWS Jun 25,2025 12:56 pm
సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సోనియమ్మ బిడ్డనని అన్నారు. తనకు రాజకీయ పరంగా ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు నాయుడును కాదనుకుని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని గుర్తు చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ పై భగ్గుమన్నారు. 10 ఏండ్ల కేసీఆర్ పాలనపై 18 నెలల మా పాలనపై చర్చ పెట్టాలన్నారు. చెట్టు కింద పెట్టండి, పెళ్ళిలో పెట్టండి, సావు కాడ పెట్టండి, కల్లు కాంపౌండ్ కాడ మాట్లాడండి, దావత్ కాడ చర్చ జరపాలన్నారు.