నటుడు శ్రీరామ్ కు నో బెయిల్..జైలుకే
NEWS Jun 25,2025 12:19 pm
డ్రగ్స్ కేసులో తమిళ సినీ నటుడు శ్రీరామ్ కు చుక్కెదురైంది. తన కుమారుడు అనారోగ్యంతో బాధ పడుతున్నాడని, తాను చేసింది తప్పేనని, మన్నించి బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన కోర్టు బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. జూలై 7 వరకు రిమాండ్ విధించింది. అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్ తనకు డ్రగ్స్ అలవాటు చేశాడంటూ బాంబు పేల్చాడు. తనకు 10 లక్షలు ఇవ్వాల్సి ఉందని, అడిగనప్పుడల్లా కొకైన్ ఇచ్చాడని వాపోయాడు.