4013 ఫోన్ నెంబర్లు ట్యాపింగ్
NEWS Jun 25,2025 12:03 pm
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు కీలక మలుపు తిరుగుతోంది. తాజాగా సిట్ జరిపిన విచారణలో 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సీఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వెల్లడించినట్లు సమాచారం. మొత్తం 4013 ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావు అండ్ టీం ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. వీరిలో 618 మంది రాజకీయ నేతల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. సీఎం, బండి, ఈటెలతో పాటు ఐఏఎస్ ల పేర్లు కూడా ఉన్నాయి.