మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
NEWS Jun 25,2025 11:12 am
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న అనంతరం మూడు నెలల లోపు ఎన్నికలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే గడువు ముగిసినా ఎందుకు ఎన్నికలు నిర్వహించ లేక పోయారనే దానిపై సరైన సమాధానం ఇవ్వక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు చేపట్టాలని జస్టిస్ మాధవి దేవి బెంచ్ తీర్పు చెప్పింది.