ఏపీ నుంచి తెలంగాణకు ఆమ్రపాలి బదిలీ
NEWS Jun 25,2025 10:40 am
సీనియర్ ఐఏఎస్ ఆమ్రపాలికి భారీ ఊరట లభించింది. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ కీలక తీర్పు చెప్పింది. ఏపీ నుంచి తనను తెలంగాణకు బదిలీ చేయాలని పేర్కొంది. దీంతో మళ్లీ తెలంగాణ క్యాడర్ కు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. తను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ లో కీ రోల్ పోషించేందుకు రెడీ అయ్యింది.