ఇజ్రాయెల్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
NEWS Jun 24,2025 06:53 pm
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ, ఇరు దేశాలు పరస్పర దాడులకు పాల్పడటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్‌తో పాటు ఇజ్రాయెల్ కూడా ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి, తక్షణమే తమ పైలట్లను వెనక్కి పిలవాలని, బాంబు దాడులు నిలిపివేయాలని ఆయన గట్టిగా హెచ్చరించారు.