మందస మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి సదాశివుని తిరుమల చైతన్య ఆకస్మికంగా పరిశీలించారు. స్థానిక పాఠశాలకు చేరుకున్న ఆయన విద్యార్థులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ అందించిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. సరైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు.