ఖతార్ లో యుఎస్ ఎయిర్ బేస్ లపై ఇరాన్ దాడి
NEWS Jun 24,2025 10:45 am
ఇజ్రాయెల్ తో పాటు ఖతార్‌లోని అమెరికా ఎయిర్ బేస్‌లపై ఇరాన్ దాడికి దిగింది. ఇరాక్, కువైట్, బహ్రెయిన్‌పైనా దాడులకు పాల్పడింది. యుఎస్ ఎయిర్‌బేస్‌లపై 6 మిస్సైల్స్‌ను ప్రయోగించింది. ఇరాన్ దాడులను తిప్పికొట్టింది ఖతార్ వైమానిక దళం. మరో వైపు ఖతార్ రాజధాని దోహాలో పలు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతానికి గగనతలం తాత్కాలికంగా మూసి వేసినట్లు ప్రకటించింది. ఇతర దేశాల పౌరుల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని వెల్లడించింది.