జగన్ పరివారానికి పవన్ కళ్యాణ్ వార్నింగ్
NEWS Jun 24,2025 08:55 am
జగన్ పరివారానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలారని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల కుప్పగా మార్చేసి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. పిచ్చి పిచ్చి మాటలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని పేర్కొన్నారు.