బీజేపీని ఢీకొనే దమ్ము మా పార్టీకి మాత్రమే ఉంది: షర్మిల
NEWS Jun 23,2025 09:17 pm
కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆమె ఆరోపించారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం, ఈ మేరకు తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రశ్నించే ధైర్యం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని షర్మిల పేర్కొన్నారు.