టెక్కలి మండల కేంద్రంలో నూతన తహసిల్దార్‌గా బి.సత్యం బాధ్యతలు చేపట్టారు. సంతకవిటి నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు ఇంఛార్జ్ తహసిల్దార్‌తో నెట్టుకొచ్చారు. ఎట్టకేలకు తహసిల్దార్‌ని నియమించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్చంతో ఆయనకు స్వాగతం పలికారు.