డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్ అరెస్ట్
NEWS Jun 23,2025 05:59 pm
డ్రగ్స్ కేసులో ప్రముఖ తమిళ నటుడు శ్రీకాంత్ ను చెన్నైలో సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ ఏఐఏడీఎంకే ఐటీ విభాగానికి చెందిన ప్రసాద్ ను విచారించగా తను మాదక ద్రవ్యాలను నటుడికి ఇచ్చినట్లు వెల్లడించాడు. ఈ విషయంపై విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని రక్త నమూనా పరీక్షలు చేశారు. ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఆయన అరెస్ట్ గురించి తన తరపు లాయర్లు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. తన అరెస్ట్ ను ధ్రువీకరించారు పోలీసులు.