ఇరాన్ దాడి చేసే ఛాన్స్..అమెరికా అలర్ట్
NEWS Jun 23,2025 01:20 pm
ఇరాన్ పై అమెరికా ఏకపక్ష దాడుల నేపథ్యంలో ఆ దేశం తిరిగి తమను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు ప్రెసిడెంట్ ట్రంప్. యుఎస్ లోని పలు నగరాలలో భద్రతను మరింత పెంచాలని ఆదేశించారు. న్యూయార్క్, వాషింగ్టన్, లాస్ ఏంజిల్స్ లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మతపరమైన ప్రదేశాలతో పాటు జనావాస ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ఇరాన్ దాడి చేయవచ్చన్న సమాచారంతో అమెరికా అప్రమత్తమైంది.