కవితక్కతో కలిసి కృష్ణయ్య సర్కార్ పై దండోరా
NEWS Jun 22,2025 01:49 pm
బీసీల కోసం అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలన్నారు బీసీ సంఘం నేత ఆర్ . కృష్ణయ్య. ప్రభుత్వానికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదన్నారు. బీసీల కోసం కవిత ముందుకు వచ్చి మాట్లాడుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కవితక్కకు బీసీలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బీసీలు పోరాటం చేసే చారిత్రక సందర్భం వచ్చిందన్నారు. బీసీలకు 75 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందన్నారు. కవిత బీసీ కాకపోయినా బీసీల కోసం పోరాడుతున్నారని కితాబు ఇచ్చారు.