ఇరాన్ పై యూఎస్ అటాక్.. కంగ్రాట్స్
NEWS Jun 22,2025 08:13 am
ఇరాన్ పై అమెరికా ఏకపక్షంగా దాడికి దిగడాన్ని స్వాగతించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇరాన్ ఆటలు సాగవని, వారిపై దాడులు కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఆపే ప్రసక్తి లేదన్నారు. ఇరాన్ పై అమెరికా చేపట్టిన దాడులు చరిత్రలో నిలిచి పోతాయని చెప్పారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని ప్రశంసించారు. బలం , బలగం ఉంటేనే శాంతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను, ట్రంప్ పూర్తిగా విశ్వసిస్తామని అన్నారు.