తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల.. 96.38 శాతం ఉత్తీర్ణత
NEWS Jun 21,2025 06:35 pm
తెలంగాణ రాష్ట్రంలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్-2025 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో 96.38 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.ఈ ఏడాది ఎడ్‌సెట్ పరీక్షకు మొత్తం 32,106 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 30,944 మంది అర్హత సాధించారు. దీంతో మొత్తం ఉత్తీర్ణత శాతం 96.38గా నమోదైందని అధికారులు పేర్కొన్నారు.