ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
NEWS Jun 21,2025 10:21 am
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అరెస్టును బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికం అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు.