బిడ్డా ఇక్కడ ఉన్నది కొండా..
NEWS Jun 21,2025 05:32 am
మంత్రి కొండా సురేఖ భగ్గుమన్నారు. మాజీ మంత్రి కడియం శ్రీహరిని టార్గెట్ చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. తన మంత్రి పదవి పోతుందంటూ దుష్ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. తనకు అదృష్టం ఉండి మంత్రి అయ్యాడని తాను ఏమైనా అన్నానా అని ప్రశ్నించారు. చిల్లర మల్లర రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ఇకనైనా తన పరిధిలో తాను ఉంటే బాగుంటుందని సూచించారు.