యోగా సాధన జీవితానికి ఆలంబన
NEWS Jun 21,2025 07:58 am
యోగా మనందరి జీవితాల్లో భాగం కావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. విశాపట్నంలో అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా కార్యక్రమంతో యావత్ ప్రపంచం మొత్తం విశాఖ నగరం వైపు చూసేలా చేశామన్నారు . భారతీయ మూలాలున్న యోగా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణకు నోచుకుంటోందన్నారు. 177 దేశాల్లో 12 లక్షల ప్రాంతాల్లో యోగా చేస్తున్నారని, 2.17 కోట్ల మంది యోగా కోసం ఎన్‌రోల్ చేసుకున్నారని చెప్పారు. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డ్ సృష్టించారని అన్నారు.