నా వల్లనే తెలంగాణ డెవలప్ అయ్యింది
NEWS Jun 20,2025 09:45 am
సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నా వల్లనే తెలంగాణ అభివృద్దిందని పేర్కొన్నారు. లేక పోతే హైదరాబాద్ కు ప్రపంచ వ్యాప్తంగా పేరు వచ్చి ఉండేది కాదన్నారు. తనకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివన్నారు. కొందరు కావాలని తనను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గోదావరి, కృష్ణా మిగులు జలాలను మాత్రమే తాము వాడుకుంటామని చెప్పామన్నారు. మనం మనం ఇచ్చి పుచ్చుకునే దోరణిలో ఉండటం మంచిదన్నారు.