ఆదిత్యానాథ్ దాస్ బక్వాస్
NEWS Jun 20,2025 07:30 am
మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఏపీలో సీఎస్ గా పని చేసిన ఆదిత్యా నాథ్ దాస్ ను ఎలా నియమిస్తారంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని చంద్రబాబు తన శిష్యుడు రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ సీఎంఓ మొత్తం ఆంధ్రా సీఎంఓగా మారి పోయిందని మండిపడ్డారు. ఏపీకి మేలు చేకూర్చేలా ఆదిత్యానాథ్ ప్రయత్నం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు.