సీఎంకు విషం తప్ప విషయం తెలియదు
NEWS Jun 20,2025 07:13 am
మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. సీఎంకు నిలువెల్లా విషం ఉందని కానీ విషయం లేదన్నారు. బూతులు మాట్లాడినంత ఈజీ కాదు ప్రాజెక్టుల గురించి తెలుసు కోవడం అన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే జనం హర్షించరని, బండకేసి కొట్టడం ఖాయమని జోష్యం చెప్పారు. ఓ వైపు ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణకు పాతరేసేలా గోదావరి, కృష్ణాల నుంచి 1000 టీఎంసీలు ఎత్తుకు పోయేందుకు ప్లాన్ చేశాడని, అదే బనకచర్ల ప్రాజెక్టు అని అన్నారు. తాను చెప్పేంత దాకా సీఎంకు సోయి లేకుండా పోయిందన్నారు.