రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
NEWS Jun 19,2025 09:43 pm
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు (జూన్ 19) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, తమ ప్రియతమ నాయకుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ గాంధీని "భారతదేశ ఆశాకిరణం" అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశంసించారు.