రైతన్నలకు అచ్చెన్న భరోసా
NEWS Jun 19,2025 05:43 pm
పొగాకు రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, చివరి ఆకు వరకు తాము కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వం రైతులను పట్టించు కోలేదన్నారు. దేశంలోనే తొలిసారిగా మార్క్ ఫెడ్ తో కలిసి పొగాకును కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా దృష్టి సారించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కొంత నష్టం జరిగిందని, కానీ ప్రతి రైతును ఆదుకుంటామని పేర్కొన్నారు.