షర్మిల ఫోన్ ట్యాపింగ్ తో నాకేం సంబంధం
NEWS Jun 19,2025 05:40 pm
తనపై సోదరి వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు మాజీ సీఎం జగన్. కేసీఆర్ షర్మిల ఫోన్ ట్యాప్ చేశాడో లేదో నాకు ఎలా తెలుస్తుందంటూ ప్రశ్నించారు. అప్పట్లో షర్మిలమ్మ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉందని, కాబట్టి ఆమె ఫోన్ ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చని పేర్కొన్నారు. అయినా ఆ వ్యవహారంతో తనకు లింకు అంటగట్టడం విడ్డూరంగా ఉందన్నారు.