రైతు భరోసా కింద గురువారం ప్రభుత్వం 5 ఎకరాలు కలిగిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. 4 లక్షల 43 వేల 167 మంది రైతులకు లబ్ధి చేకూరింది. రూ.1189.43 కోట్ల నిధులు విడుదల కాగా 19 లక్షల 82, 392 ఎకరాలకు రైతు భరోసా వర్తింప చేశారు. ఇప్పటి వరకు 62 లక్షల మంది రైతులకు రూ 6404.70 కోట్లు విడుదల చేసింది.