సాక్ష్యాలు క్రియేట్ చేసి మరీ తప్పుడు కేసులు: జగన్
NEWS Jun 19,2025 08:34 am
తన చుట్టూ ఉన్న నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించి వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలను జైలుకు పంపడమే విధిగా పెట్టుకుందని మండిపడ్డారు.