తమిళ నటుడు ఆర్యకు ఐటీ షాక్
NEWS Jun 19,2025 01:42 pm
తమిళ సినీ నటుడు, నిర్మాత ఆర్యకు బిగ్ షాక్ తగిలింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఐటీ శాఖ రంగంలోకి దిగింది. తనకు సంబంధించిన నివాసాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలలో విస్తృతంగా దాడులు చేపట్టింది. తను రెస్టారెంట్స్, హోటల్స్ ను కలిగి ఉన్నాడు. గత కొంత కాలంగా ఆయా వ్యాపారాలకు సంబంధించి ఆదాయపు పన్నులు చెల్లించడం లేదంటూ పేర్కొంది ఐటీ.