జగన్ టూర్ లో అత్యుత్సాహం.. అంబటి రాంబాబుపై కేసు
NEWS Jun 19,2025 11:47 am
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆ పార్టీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహితలోని 188, 332, 353, 427 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈమేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది.