రేణిగుంటకు వెళ్లే ఫ్లైట్ లో సాంకేతిక లోపం
NEWS Jun 19,2025 10:36 am
హైదరాబాద్ నుండి రేణిగుంటకు బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో నిలిపి వేశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 6:30 గంటలకు రన్‌వేపైకి చేరుకున్న విమానంలోంచి వింత శబ్దాలు రావడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. తనిఖీ చేశారు. టెక్నికల్ ప్రాబ్లం ఉందని గుర్తించారు. దానిని రన్ వే నుండి దారి మళ్లించారు. దీంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.