ఎంపీ రాహుల్ గాంధీ పుట్టిన రోజు ఇవాళ. ఘనమైన రాజకీయ వారసత్వం కలిగిన చరిత్ర తనది. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో చదువుకున్నాడు. పొలిటికల్ లీడర్ గా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జూన్ 19, 1970లో పుట్టాడు. తనకు 56 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. తనపై ఎన్ని ట్రోల్స్ చేసినా నవ్వుకుంటూ వెళ్లడం అలవాటుగా చేసుకున్నాడు. కాషాయ పరివారం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు, ఛీత్కారాలు , మీమ్స్ చేసినా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇది తన ప్రత్యేకత.