కార్మిక, గనుల శాఖపై మంచి పట్టుంది
NEWS Jun 18,2025 08:53 pm
కార్మిక, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బుధవారం సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొత్త గనులతో పాటు జాబ్స్ కూడా రావాలన్నారు. మైనింగ్ పై ఓపెన్ ఆక్షన్ కు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలిపారు. గతంలో తన తండ్రి కార్మిక శాఖ మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. కార్మికుల కోసం ఎన్నో చేశారని, ఆయన బాటలోనే తాను నడుస్తానని చెప్పారు.